అంకెల గారడీ చిరునామాల సారథి Pin Code and IFSC Code
ఇప్పుడంటే అందరి వద్ద ఫోన్లే కాబట్టి ఎవరికి మెసేజ్ చేసినా సెకన్లలో వెళ్ళి పోతుంది సమాధానం వస్తుంది కానీ, పూర్వపు రోజుల్లో నాకు ఉత్తరం వస్తుంది అని వెయ్యి కళ్లతో ఆశగా చూసేవారు. ఇప్పటికీ చాలా మందికి ఉత్తరాలే ఇంకా అద్భుతమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి.
మరి ఇంత పెద్ద దేశంలో ఎక్కడో రాసిన ఉత్తరం రోజులు తిరిగినా ఎక్కడా తప్పుపోకుండా గమ్యానికి చేరటం వెనక ఉన్న గారడీ ఏంటో తెలుసా అదే పిన్ కోడ్.
ఈ పిన్ కోడ్ 6 అంకెలతో ఉంటుంది. 6 అంకెల దేశం మొత్తం సరిపోతుందా? అవును వాటిని అలా కూర్చారు మరి.

పిన్ కోడ్ అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిస్తే, ఇది పోస్టల్ ఇండెక్స్ నంబర్, 6 అంకెల సంఖ్య. ఇది పోస్టల్ వ్యవస్థలో చిరునామాను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
పిన్ కోడ్ లోని ఆరు అంకెల మర్మం ఏంటో తెలుసా?
మనం ప్రతిరోజూ వాడే ఈ ఆరు అంకెలు కేవలం నంబర్లు మాత్రమే కాదు, అవి మన చిరునామాను వెతికి పట్టుకునే దిక్సూచీలు. ఈ ఆరు అంకెల వెనుక ఉన్న అసలు రహస్యం ఇది:
- మొదటి అంకె (రీజియన్): మొదటి అంకె మన భారతదేశాన్ని వివిధ మండలాలుగా (Regions) విడదీస్తుంది. మన దేశంలో మొత్తం 9 రీజియన్లు ఉన్నాయి. ఉదాహరణకు ‘5’ అనే అంకెతో మన పిన్ కోడ్ మొదలైతే, అది దక్షిణ భారతదేశం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) అని అర్థం.
- రెండవ అంకె (సబ్–రీజియన్): ఇది ఆ రీజియన్ లోని ఒక ప్రత్యేక భాగాన్ని లేదా రాష్ట్రాన్ని సూచిస్తుంది. మొదటి రెండు అంకెలు కలిపి చదివితే అది ఏ రాష్ట్రమో ఇట్టే తెలిసిపోతుంది.
- మూడవ అంకె (సార్టింగ్ జిల్లా): మూడవ అంకె ఆ రాష్ట్రంలోని ఒక నిర్ణీత ‘సార్టింగ్’ జిల్లాను సూచిస్తుంది. అంటే, ఉత్తరాలు అన్నీ ఒక చోట చేరినప్పుడు వాటిని జిల్లాల వారీగా విడదీయడానికి ఈ అంకె ఎంతో కీలకం.
- చివరి మూడు అంకెలు (పోస్టాఫీసు): ఇక చివరి మూడు అంకెలు (4, 5, 6) చాలా ముఖ్యమైనవి. ఇవి నేరుగా మీ ఏరియాలోని ఒక నిర్దిష్టమైన పోస్టాఫీసును (Delivery Post Office) సూచిస్తాయి. ఆ అంకెల ఆధారంగానే ఉత్తరం నేరుగా మీ ఇంటి దగ్గరి పోస్టాఫీసుకు చేరుకుంటుంది.
అయితే చాలా పోస్టాఫీసులు మూసివేయటం లేదా వేరే పోస్టాఫీసులతో కలిపివేయటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వారి pincode ఉపయోగంలో ఉండవు కానీ ఆ pincode లకు సంబంధించిన వివరాలు update చేయబడవు. ఇప్పటికీ చాలా website లలో అవే చూపిస్తోంది. దీని వలన ఇప్పుడు సమాచారంతో పాటు గందరగోళం కూడా ఏర్పడుచుంటుంది.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
Pincode Book — ఇది ఒక కొత్త website దీనిలో భారతదేశానికి సంబంధించిన అన్ని pincode ల యొక్క పూర్తి సమాచారం update చేసి ఉంచారు. వీటితో పాటు భారతదేశంలో ఉన్న అన్ని Bankల యొక్క IFSC కోడ్ లు Bank అడ్రస్సులు కూడా update చేసి ఉంచారు.
ఒక ఉపయోగ కరమైన విషయం ఏమిటంటే మీరు pincode వెతికితే pincode వివరాలతో పాటు చుట్టు పక్కల ఉన్న pincode ల వివరాలు కూడా Google Map తో సహా వస్తాయి అంతేకాదు ఆ pincode కి సంబంధించి దగ్గర్లో ఉన్న అన్ని Bank ల వివరాలు IFSC Code కూడా వస్తాయి.
ఈ వెబ్‌సైట్ ప్రత్యేకతలు:
తాజా మరియు ఖచ్చితమైన డేటా
IFSC కోడ్ మరియు PIN కోడ్ ఒకే చోట
సులభమైన సెర్చ్
వేగవంతమైన ఫలితాలు
పూర్తిగా ఉచితం
చూశారా! చిన్న ఆరు అంకెల పిన్ కోడ్‌లోనే ఎంతటి వ్యవస్థ దాగి ఉందో. మనం పైన చెప్పుకున్న Pincode Book వంటి వెబ్‌సైట్‌లలో ఈ వివరాలన్నీ ఎంతో స్పష్టంగా, అప్ డేటెడ్ గా దొరుకుతాయి. అంకెల గారడీ అంటే ఇదే కదా!
బ్యాంకు వివరాల వారధి.. ఈ IFSC కోడ్!
పిన్ కోడ్ చిరునామాను వెతికి పట్టుకున్నట్టే, మన డబ్బులు సరైన బ్యాంకు ఖాతాకు చేరడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది, అదే IFSC (Indian Financial System Code).
పైన మనం చెప్పుకున్న Pincode Book వెబ్‌సైట్ కేవలం పిన్ కోడ్‌లకే పరిమితం కాలేదు. భారతదేశంలోని ఏ మూల ఉన్న బ్యాంకు శాఖనైనా ఇట్టే గుర్తుపట్టేలా ఇందులో IFSC కోడ్ వివరాలను కూడా పొందుపరిచారు.
ఈ 11 అంకెల కోడ్ వెనుక ఉన్న వింతను గమనిస్తే:
- మొదటి నాలుగు అక్షరాలు: ఇవి బ్యాంకు పేరును సూచిస్తాయి (ఉదాహరణకు SBI బ్యాంకు అయితే SBIN అని ఉంటుంది).
- ఐదవ అంకె: ఇది ఎప్పుడూ ‘0’ (సున్నా) గానే ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే మార్పుల కోసం దీనిని ఇలా ఉంచారు.
- చివరి ఆరు అంకెలు: ఇవి ఆ బ్యాంకు యొక్క నిర్దిష్టమైన శాఖను (Branch) తెలియజేస్తాయి.
డిజిటల్ యుగంలో మనం చేసే ప్రతి లావాదేవీకి ఈ కోడ్ ప్రాణం లాంటిది. ఒక్క అక్షరం తప్పుగా కొట్టినా డబ్బులు ఎక్కడికో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే, పాత వెబ్‌సైట్‌లలో ఉండే పాతబడిన సమాచారం నమ్మి మోసపోకుండా, ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు Update చేయబడిన ఖచ్చితమైన వివరాలను పొందవచ్చు.
మీ ఊరి పిన్ కోడ్‌తో పాటు, మీ బ్యాంకు బ్రాంచ్ అడ్రస్, ఫోన్ నంబర్ మరియు IFSC కోడ్.. అన్నీ ఒకే చోట, ఒకే క్లిక్‌తో లభించడం నిజంగా అంకెల గారడీయే కదా!
ఈ అద్భుతమైన వెబ్‌సైట్ ద్వారా మీ సమాచారాన్ని సరిచూసుకుని, గందరగోళం లేకుండా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు.
Search pincodes by State Telangana Andhrapradesh
Search Bank IFSC Codes by State Andhra Pradesh Telangana
43 Free Browser-Based Tools Built for India — All in One Place

About Pincode in telugu
About IFSC code in telugu
